అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Thu,October 17, 2019 12:40 PM

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. గీతా(24) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భర్త, అత్తమామల వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

586
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles