రాష్ర్టంలో తగ్గిన మాతాశిశు మరణాల రేటు

Tue,September 10, 2019 07:51 AM

హైదరాబాద్: జాతీయ, రాష్ర్టాల పరిధిలో వాస్తవ లెక్కలతో నిర్వహించే సామాజిక ఆర్థిక సర్వే నివేదికలో తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగంలో చేపట్టిన చర్యలపై ప్రశంసలు దక్కాయి. గడిచిన ఐదేండ్లలో సర్కారు దవాఖానల్లో అందిస్తున్న వైద్యసేవల్లో పురోగతి సాధించినట్టు నివేదిక ప్రశంసించింది. మాతాశిశు మరణాల రేటు గణనీయంగా తగ్గుముఖం పట్టిందని అభినందించింది. ప్రధానంగా మాతా, శిశు సంరక్షణ కోసం కల్పించిన వైద్యసౌకర్యాలు, ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాలకు కితాబిచ్చింది. వ్యాధుల నియంత్రణలో భాగంగా సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావడం, వసతులు కల్పించడం, వైద్యపరీక్షల నిర్వహణకు ప్రత్యేక యూనిట్లు ఏర్పాటుచేయడం, ప్రజారోగ్య కార్యక్రమాల అమలుకు సాంకేతికతను ఉపయోగించడాన్ని ప్రశంసించింది. ఆయుర్దాయం వృద్ధిరేటులో 21 పెద్దరాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్రం పురోగతి సాధించినట్టు, కేసీఆర్ కిట్ల పథకం, అమ్మఒడి అమలుతో సర్కారు దవాఖానల్లోనే ప్రసవాలు జరుగుతుండటంతో మాతాశిశు మరణాల రేటు గణనీయంగా తగ్గినట్టు కితాబిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో దేశవ్యాప్తంగా 78.9 శాతం ప్రసవాలు జరుగుతుండగా... తెలంగాణ రాష్ట్రంలో 91.5 ఉండటం విశేషమని పేర్కొన్నది.

246
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles