వరద నీటిలో చిక్కుకున్న మేడారం భక్తులు సురక్షితం

Wed,August 7, 2019 06:30 PM

ములుగు : జిల్లాలో వానలు జోరుగా కురుస్తున్నాయి. దీంతో వాగులు ఉప్పొంగుతున్నాయి. గోవిందరావుపేట మండలం పస్రా - నార్లాపురం మధ్య జంపన్న వాగు పొంగింది. జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. ఇవాళ ఉదయం మేడారం వైపు వాహనాల్లో వెళ్లిన 23 మంది భక్తులు వరద నీటిలో చిక్కుకున్నారు. రహదారిపై వరద ప్రవహిస్తుండడంతో భక్తులు తిరిగి రాలేకపోయారు. దీంతో భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహాయంతో భక్తులు వరద నీటి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. భక్తుల్లో 17 మంది వరంగల్, హన్మకొండ వాసులు కాగా, మిగతా వారు ఆర్మూర్ వాసులు.

1285
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles