గైర్హాజరైన ఇద్దరు వైద్యులకు మెమోలు జారీ

Wed,May 15, 2019 07:09 PM

Memos were issued to two physicians in jayashankar bhupalpally district

జయశంకర్‌ భూపాలపల్లి: విధులకు గైర్హాజరైన ఇద్దరు వైద్యులకు జిల్లా కలెక్టర్‌ మెమోలు జారీ చేశారు. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. మల్హర్‌ మండలం అడవిసోమన్‌పల్లి వద్ద బస్సు బోల్తాపడి పలువురి ప్రయాణికులకు గాయాలైన విషయం తెలిసిందే. ప్రమాద బాధితులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో వైద్యులు విధుల్లో లేరు. దీంతో విధుల్లో నిర్లక్ష్యం చూపారన్న కారణంగా కాటారం పీహెచ్‌సీ వైద్యురాలు ఉమాదేవికి, మహాదేవ్‌పూర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వాసుదేవరెడ్డికి కలెక్టర్‌ వెంకటేశ్వర్లు మెమో జారీ చేశారు.

1348
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles