తన వల్ల వ్యక్తి మృతి చెందాడని వ్యాపారి ఆత్మహత్య

Wed,August 14, 2019 06:39 PM

merchant commits suicide at kukatpally

హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లిలో వ్యాపారి ఆత్మహత్య కలకలం రేపింది. ఓ భవనంలోని ఐదో అంతస్తు నుంచి దూకి వ్యాపారి మోహన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యాపారి ఆత్మహత్యకు రోడ్డు ప్రమాదం ఘటన దారి తీసినట్లు సమాచారం. సంఘటన వివరాల్లోకి వెళితే ఉదయం రోడ్డు ప్రమాదంలో వ్యాపారి ప్రయాణిస్తున్న వాహనం బైక్‌ను ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. తన స్నేహితులతో పటాన్‌చెరు వద్ద గుడికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టి వ్యక్తి చనిపోవడంతో మోహన్‌ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. భవనం ఐదో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

2092
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles