అనుమానస్పద స్థితిలో వ్యాపారి మృతి

Thu,October 4, 2018 11:16 AM

భద్రాద్రికొత్తగూడెం: పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి అనుమాస్పదస్థితిలో మృతిచెందిన సంఘటన గురువారం రైటర్ బస్తీలో జరిగింది. వివరాలు.. వంగవీటి యాదగిరి (58) పట్టణంలోని పెద్ద బజార్ లో జనరల్ స్టోర్స్, ఐరన్ షాప్ ల వ్యాపారం చేస్తున్నారు. యాదగిరికి కొంతకాలంగా ఖమ్మంలో ఉన్న తమ అస్తుల వివాదాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా రాత్రి తమ లాయర్ ఫోన్ చేశాడని చెప్పి, అస్తి తాలూక ఈసీ కాగితాలు తెస్తానని బయటికి వచ్చాడని కుటుంబీకులు పేర్కొంటున్నారు.

ఉదయం రైటర్ బస్తీలోని సేయింట్ జేవియర్ చర్చి ఎదురుగా గల బస్ షెల్టర్ లో ఓ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెంది ఉండడం గమనించి వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు అక్కడి పరిస్థితులను పరిశీలించి మృతుడు వ్యాపారి యాదగిరిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని మార్చూరికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

1004
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles