'దేవాదుల' నీటి విడుదలపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

Mon,August 19, 2019 03:16 PM

minister errabelli dayakar rao holds review meet

హైదరాబాద్‌: దేవాదుల ఎత్తిపోతల పథకం కింద రిజర్వాయర్‌ల నుంచి చెరువులకు, పొలాలకు నీటి సరఫరాను పకడ్బందీగా చేయాలని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం నీటి విడుదల ప్రణాళికపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జనగామ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పాగాల సమోత రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్‌, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, దేవాదుల సీఈ బంగారయ్య, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డితో పాటు వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ జిల్లాల సాగునీటి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

726
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles