టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి: మంత్రి ఎర్రబెల్లి

Tue,January 14, 2020 07:36 PM

తొర్రూరు: బంగారు తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతోనే తొర్రూరు అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ ఆధిక్యంతో గెలిపించాలని ప్రజలను కోరారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో మంత్రి దయాకర్‌రావు తొర్రూరులోని తన క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు.


16 వార్డులలో రెండు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన 14 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో గెలిచేలా సమష్టిగా కృషి చేయాలని అన్నారు. సంక్రాంతి రోజు నుంచే అన్ని వార్డులలో ప్రచారాన్ని పెంచాలని కోరారు. టీఆర్‌ఎస్‌ తరపున ఎక్కువ మంది టిక్కెట్లు ఆశించారని... పార్టీ కోసం ఉపసంహరించుకున్న అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు అని చెప్పారు. టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం పని చేసిన వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని, అందరికీ అవకాశాలు వచ్చేలా చూస్తానని అన్నారు. అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకున్న వారి త్యాగం గొప్పదని పేర్కొన్నారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని, వచ్చే రెండేళ్లలో పట్టణం సమగ్ర స్వరూపం మారేలా పని చేస్తానని చెప్పారు. సంక్రాంతి రోజు నుంచి ప్రచారం ప్రారంభిస్తానని... పార్టీ నేతలు, శ్రేణులు అందరు కలిసి ముందుకు సాగాలని అన్నారు.

288
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles