‘బొగత’ను సందర్శించిన మంత్రి అల్లోల కుటుంబసభ్యులు

Tue,August 20, 2019 08:35 PM

minister family members visits  Bogatha Waterfalls

వాజేడు(ములుగు): ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగర బొగత జలపాతాన్ని మంగళవారం రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మి తన కుటుంబసభ్యులతో కలసి సందర్శించారు. జలపాతం అందాలకు మంత్రముగ్దులయ్యారు. ఫొటోలు దిగుతూ సందడి చేశారు. బొగత రైడర్‌ వాహనంలో ఎక్కి జలపాతం బాగుందని కితాబిచ్చారు. జలపాతం వద్ద అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో బొగత విశిష్టతను వారికి వివరించారు.

1300
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles