ప్రజ్ఙాపూర్ ప్రమాద మృతులకు మంత్రి, ఎమ్మెల్యే నివాళి...

Mon,October 21, 2019 04:50 PM

కరీంనగర్: మానకొండురు మండలం వేగురపల్లి లో రహదారి ప్రమాదములో మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తల మృతదేహాలకు మంత్రి గంగుల కమలాకర్ నివాళులర్పించారు. మంత్రితో పాటు మానకొండూరు శాసన సభ్యులు రసమయి, ఎమ్మెల్సీ,నారదాసు,సుడా చైర్మెన్,జి.వి.రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్ ఉన్నరు. బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి మృతుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని తెలిపారు.


నిన్న రాత్రి హైదరాబాద్ వెళ్లి వస్తుండగా ప్రజ్ఞాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గులరు టీఆర్ఎస్ కార్యకర్తలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాద ఘటనపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

2979
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles