ఉత్తమ్, రేవంత్‌లు తోడు దొంగలు: మంత్రి జగదీశ్‌రెడ్డి

Sat,October 19, 2019 04:40 PM

ఉత్తమ్, రేవంత్‌లు తోడు దొంగలని మంత్రి జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. 50 లక్షల రూపాయాలతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది రేవంత్ రెడ్డి అయితే, ముడుకోట్ల రూపాయలు కారులో తగుల బెట్టుకుంది ఉత్తమ్ అని ఎద్దేవా చేశారు. ఈ ఇద్దరు దొంగలు కలసి హుజూర్‌నగర్ నియోజకవర్గంపై దాడికి దిగుతున్నారు. ఉత్తమ్ పద్మావతికి టికెట్ ఇవ్వొద్దన్న రేవంత్ ని ప్రచారానికి దింపి ఉత్తమ్ తన దివాళా కోరుతనాన్ని చాటుకున్నాడు.


సూర్యపేట అభివృద్ధి పై చర్చకు సిద్ధమా ఉత్తమ్ కు మంత్రి సవాల్ విసిరారు. అది హుజూర్‌నగర్ సెంటర్...సూర్యపేట సెంటరా అన్నది తేల్చుకోవాల్సింది ఉత్తమ్ కుమార్ రెడ్డినే. సమయం ,స్థలం వారు చెప్పినా సరే ...నన్ను చెప్పమన్నా సిద్దంగా ఉన్నాం. నేను ఐదు ఏండ్ల శాసనసభ్యుడిగా సూర్యపేటలో జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకో. 20 ఏండ్లుగా శాసనసభ్యుడిగా, మంత్రిగా కేంద్ర, రాష్ట్రాలలో అధికారం లో ఉండి చేసింది ఏమిటని ప్రశ్నించారు.

హుజూర్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి అభివృద్ధి చేయడం తెలువదనే కోదాడ ప్రజలు ఇంటికి పంపారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు జ్ఞాపకశక్తి ఎక్కువ. ఉత్తమ్ ,రేవంత్ ల అరాచకాలు ప్రజలకు ఎప్పటికి మరచిపోరు. రేపటి ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

863
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles