కాంగ్రెస్‌, బీజేపీవి చిల్లర రాజకీయాలు : మంత్రి సత్యవతి

Tue,November 5, 2019 02:40 PM

మహబూబాబాద్‌ : ఆర్టీసీ పేరుతో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు రోడ్లపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మండిపడ్డారు. మహబూబాబాద్‌లోని ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో మీడియాతో మంత్రి మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడానికి ఇది సరైన సమయం కాదు. కార్మికులు యూనియన్‌ నాయకుల ఉచ్చులో పడొద్దని ఆమె సూచించారు. కార్మికుల శ్రేయస్సు కోరి.. విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్‌ నేటి రాత్రి వరకు గడువు విధించారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణలో మొత్తం 91 కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక్క ఆర్టీసీని విలీనం చేస్తే.. మిగతా కార్పొరేషన్లు కూడా విలీనం డిమాండ్‌ను తీసుకువస్తాయన్నారు. గత ప్రభుత్వాలు చిరు ఉద్యోగుల విషయంలో చేసిన అనేక తప్పులను సవరించి వారికి జీతాలు పెంచిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని మంత్రి సత్యవతి తెలిపారు.

1251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles