దేవరుప్పుల రోడ్డు ప్రమాదంపై మంత్రి సత్యవతి రాథోడ్ దిగ్భ్రాంతి

Thu,September 19, 2019 01:36 PM

హైదరాబాద్ : జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మహబూబాబాద్ కి చెందిన పెనుగొండ గణేష్(60),పెనుగొండ సుకన్య(38),ఎండి,నజీర్,(డ్రైవర్), శ్రీలత మృతి పట్ల గిరిజన సంక్షేమ, మహిళా- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న మంజూష ఆరోగ్య పరిస్థితి గురించి అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు.


మృతుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో మంత్రి సత్యవతి రాథోడ్ గారు స్వయంగా మాట్లాడారు. మృతుల కుటుంబ సభ్యులు, చికిత్స పొందుతున్న మంజూషకు కావాల్సిన సాయాన్ని ఎమ్మెల్యే శంకర్ నాయక్ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

1218
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles