ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి..

Thu,October 10, 2019 09:10 AM

ఘట్‌కేసర్: ఘట్ కేసర్ లో మంత్రి మల్లారెడ్ది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి, వారి సమస్యలు పరిష్కరించేందుకు కార్యాలయం ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి అన్నారు. ప్రజలకు స్థానికంగా ఉండి సేవలు అందించేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉపయోగకరంగా ఉంటుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఘట్‌కేసర్ ఓఆర్‌ఆర్ జంక్షన్ వద్ద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనం ప్రారంభోత్సవ వేడుకలు దసరా పండుగ రోజు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రితో పాటు జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌ చంద్రారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుధీర్‌రెడ్డితో పాటు నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles