రైతులందరూ సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలి : ఎర్రబెల్లి

Fri,May 18, 2018 10:28 AM

జనగామ: జిల్లాలోని దేవరుప్పల మండలం కడవెండి గ్రామంలో రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శ రాష్ట్రంగా నిలుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. సీఎం ముందుచూపుతో రైతుల కష్టాలను దూరం చేశాడని తెలిపారు. తెలంగాణ ప్రజానీకం సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీలకు స్థానం లేదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కుదేలైన వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి.. రైతాంగానికి ఎరువులు, 24 గంటల విద్యుత్, పంట పెట్టుబడి అందిస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.

1075
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles