చింతలేని గ్రామంగా చింతమడక : హరీష్‌ రావు

Mon,July 22, 2019 01:29 PM

MLA Harish Rao speech at Chintamadaka village

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాకతో చింతలేని గ్రామంగా చింతమడక మారుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ చింతమడక పర్యటన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో హరీష్‌ రావు ప్రసంగించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు చింతమడక బాసటగా నిలిచింది. ఆమరణ దీక్ష సమయంలో చింతమడకలో ఒక్క ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు. ఉద్యమంలో మీరంతా కేసీఆర్‌ను వెన్నంటి ఉన్నారు. చింతమడకవాసులతో ఆత్మీయానురాగాలు పంచుకునేందుకు కేసీఆర్‌ వచ్చారు. కేసీఆర్‌ రాకతో బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు ఒక్కసారి వచ్చినట్లుంది. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తాం. ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణం చేయిస్తాం. చింతమడక పరిసర గ్రామాలకు రహదారులు కావాలని విజ్ఞప్తులు అందాయి. చింతమడకలో అభివృద్ధి పనుల కోసం రూ. 10 కోట్లు ఇవ్వాలని కోరుతున్నాం. సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నిధుల మంజూరు చేయాలని విజ్ఞప్తి. సిద్దిపేట పట్టణంలో మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నానని హరీష్‌ రావు పేర్కొన్నారు.

2142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles