ఎమ్మెల్యే రాజా సింగ్ పాట‌పై పాకిస్థాన్‌ అభ్యంత‌రం

Mon,April 15, 2019 03:19 PM

MLA Raja Singh copied our songs, says Pakistan Army officer

హైద‌రాబాద్‌: గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పాడిన పాట వివాదానికి దారి తీసింది. శ్రీరామనవమి సందర్భంగా హిందుస్థాన్ జిందాబాద్ అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్వ‌యంగా ఓ పాట పాడారు. అయితే ఆ పాట‌ను కాపీ కొట్టార‌ని పాకిస్థాన్ ఆరోపిస్తున్న‌ది. మార్చి 23 పాకిస్థాన్ డే సందర్భంగా తాము రూపొందించిన ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’పాటకు ఇది కాపీ అంటూ పాకిస్థాన్ ఆర్మీ అధికారి మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అసిఫ్ గ‌ఫూర్ ట్వీట్ చేశారు. ఈ పాటను పాక్‌కు చెందిన సహిర్‌ అలీ బగ్గా రాసారని తెలియజేశారు. పాట‌ను కాపీ చేయ‌డం సంతోష‌మే అని, కానీ నిజ‌మైన పాట పాడితే బాగుంటుందని ఆ అధికారి ఓ ట్వీట్‌లో చెప్పారు. పాకిస్థాన్ జిందాబాద్ స్థానంలో హిందుస్థాన్ జిందాబాద్ అని పాడుతున్నార‌ని పాక్ అధికారి ఆరోపించారు. దిల్ కా హిమ్మ‌త్ వ‌త‌న్‌.. అప్నా జ‌జ్‌బా వ‌త‌న్‌. మ‌న్ కీ స‌చ్చీ ల‌గ‌న్‌... సీదా ర‌స్తా వ‌త‌న్ అన్న పాట‌ను రాజా సింగ్ పాడారు. అయితే ఆ పాట త‌మ‌దే అని పాక్ అంటోంది. త‌న పాట‌ను ఆదివారం రిలీజ్ చేయాల‌నుకున్న రాజా సింగ్‌.. పాక్ ఆరోప‌ణ‌లు రావ‌డంతో దాన్ని వాయిదా వేశారు.3107
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles