21న మహారాష్ర్టకు రుతుపవనాలు

Tue,June 18, 2019 06:17 AM

Monsoon Forecast  to Maharashtra 21st june 2019

నైరుతి రుతుపవనాలు ఈ నెల 21వ తేదీన మహారాష్ర్టకు రానున్నాయని.. జూన్ 24 లేదా 25లోపు రాష్ట్రమంతటా విస్తారమైన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ వాయు మరింత బలహీనపడింది. గత గురువారమే అది తీరం దాటుతుందని భావించినప్పటికీ.. మంగళవారం ఉదయం తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. వాయు ప్రభావంతో గుజరాత్‌లో విస్తారమైన వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. ఈ క్రమంలో సహాయ చర్యలు చేపట్టేందుకు ఐదు జాతీయ విపత్తు సహాయ బృందాలు (ఎన్డీఆర్‌ఎఫ్) సిద్ధమయ్యాయి. వాయు తుఫాన్ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారవచ్చని..అయినా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది.

686
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles