జూన్ 4న కేరళను తాకనున్న రుతుపవనాలు: స్కైమెట్

Tue,May 14, 2019 05:03 PM

Monsoon to hit Kerala coast on 4th June 2019 expected to be below average

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం జూన్ 4వ తేదీన కేరళాను తాకనున్నట్లు స్కైమెట్ సంస్థ ప్రకటించింది. 2019 సంవత్సరంలో వర్షాలు సాధారణంగా ఉంటాయని పేర్కొంది. జులై 15వ తేదీ వరకు రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపిస్తాయని పేర్కొన్నారు. దీంతో పంట దిగుబ‌డి కూడా అధికంగా ఉంటుంద‌ని పేర్కొన్న‌ది. ఆర్థిక ప్ర‌గ‌తి కూడా బాగానే ఉంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. దేశ‌వ్యాప్తంగా సాధార‌ణ వ‌ర్ష పాతం న‌మోద‌య్యే ప్రాంతాలు 70 శాతం క‌న్నా ఎక్కువే ఉన్న‌ట్లు స్కైమెట్ సీఈవో తెలిపారు. కొన్ని ప్ర‌దేశాల్లో మాత్ర‌మే అధిక వ‌ర్షం సూచ‌న ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

1716
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles