ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే..

Sat,November 9, 2019 03:56 PM

నల్లగొండ: రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నకిరికేల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంయుక్తంగా ప్రారంభించారు. నల్లగొండ జిల్లా, కేతిరెడ్డి మండలం, భీమారం గ్రామంలో ఐకేపీ(ఇందిరా క్రాంతి పథం) ఆధ్వర్యంలో వారు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని పంటలకు గిట్టుబాలు ధర ప్రకటించిందనీ, పత్తి, మొక్కజొన్న మొదలగు పంటలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే విక్రయించి, పంటకు సరైన లాభం పొందాలని సూచించారు. దళారులకు విక్రయించి అనవసరంగా మోసపోవద్దని వారు ఈ సందర్భంగా రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles