మహేందర్‌రెడ్డితో ఎంపీ రంజిత్‌రెడ్డి మర్యాదపూర్వక భేటీ

Fri,May 24, 2019 04:03 PM

MP Ranjit Reddy meets with EX minister Mahender Reddy

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి నేడు మాజీ మంత్రి మహేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ ఎంపీగా రంజిత్‌రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో తన గెలుపుకు కృషిచేసిన మహేందర్‌రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. మహేందర్‌రెడ్డి సహకారంతో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని వెల్లడించారు.

1063
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles