ఈ నెల 10న నాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక

Sat,November 9, 2019 03:35 PM

హైదరాబాద్: నాయీ బ్రాహ్మణ యువతీ, యువకుల వివాహ సంబంధాల కోసం పరిచయ కార్యక్రమం ఈ నెల 10న(ఆదివారం) కొత్తపేటలో జరగనుంది. దిల్‌సుఖ్‌నగర్ కొత్తపేటలో గల బాబు జగ్జీవన్‌రామ్ భవన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మహేష్ చంద్ర నాయి ఒక ప్రకటనలో తెలిజేశారు. పరిచయ వేదిక కార్యక్రమం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని వారు పేర్కొన్నారు. పెళ్లి సంబంధాల కోసం ఎదురుచూస్తున్న నాయి బ్రాహ్మనుంలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని వారు తెలిపారు. అదేవిధంగా పునర్విహాల కోసం ఎదురుచూస్తున్న వితంతువులు, విడాకులు పొందిన వారు సైతం తమకు నచ్చిన భాగస్వామిని ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం ద్వారా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. మరిన్ని వివరాలకు 9849566988, 9391357109 నంబర్లను సంప్రదించి తెలుసుకోవచ్చని వారు తెలిపారు.

540
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles