29న నమో వేంకటేశాయ రథయాత్ర

Fri,July 26, 2019 06:17 AM

Namovenkateshaya rathayatra willbe held on july 26th


హిమాయత్‌నగర్‌: కలియుగదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి కోట్ల జపంలో భాగంగా సప్త దశ (17) పర్యాయంగా నమో వేంకటే శాయ రథయాత్ర కార్యక్రమం హబ్సి గూడ లోని కాక తీయనగర్‌ నుంచి ఈ నెల 29వ తేదీన ప్రారంభమవుతుందని శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు పుల్లగూర్ల సాయిరెడ్డి గురువారం ఒక ప్రక టనలో తెలిపారు.శ్రీవారికి ఈ ఏడాది సమర్పించబోయే 7 కోట్ల జపంలో వీలైనంత ఎక్కువ మంది భక్తులను భాగస్వాములుగా చేయా లనే సంకల్పంతో రథయాత్రకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

ఉభయ తెలుగు రాష్ర్టాలలోని వివిధ ప్రాంతాలలో తిరిగి ఆగస్టు 22న తిరుపతికి చేరు కుంటుందని, 23న గోకులాష్టమి రోజున ఎస్వీ డైరీ ఫాంలో జపహోమా దులు నిర్వహించి దివ్య మహామంత్ర స్థూపంలో స్వామివారికి సమర్పించ బడుతుందని వివరించారు. ఆసక్తి గల వారు ఈ యాత్రలో పాల్గొన్న వచ్చని వివరాల కోసం 9348212354 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.

336
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles