101 జాతీయ జెండాలతో నిత్య జనగణమన కార్యక్రమం

Mon,January 1, 2018 11:55 AM

జగిత్యాల: కోరుట్లలో 101 జాతీయ జెండాలతో నిత్య జనగణమన కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో ప్రజలంతా జాతీయ రహదారిపై జెండాలు ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ నిత్య జనగణమన కార్యక్రమం ప్రారంభమయింది. దేశభక్తి పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని కోరుట్ల కిరాణా వర్తక సంఘం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, స్థానికులు హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

1721
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles