పోలీసులకు దొరకకుండా నయా స్కెచ్‌లు

Sun,August 25, 2019 06:06 AM

Neo sketches Criminal escape from police hyderabad

హైదరాబాద్ : ఒక్కో క్రిమినల్.. ఒక్కో స్టైల్‌లో నేరానికి పాల్పడుతున్నాడు. రోజుకో నేర ప్రక్రియతో దోచేస్తున్నారు. మాయమాటలు చెప్పి, దృష్టి మళ్లింది, బెదిరించి ఇలా పలువురిని నిండా ముంచేస్తున్నారు. కొత్త కొత్త ఐడియాలతో నేరాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఈ క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తుంది. ఆలస్యమైనా పోలీసులు రివర్స్ స్కెచ్‌లువేసి దుండగులను అరెస్ట్ చేసి వారి నేరాలకు చెక్ పెడుతున్నారు. దీంతో ఇప్పుడు పోలీసుల చేజింగ్.. కరుడుగట్టిన దుండగులను వణికించేస్తుంది. చాలా మంది నేరస్థులు ఇప్పుడు నగరం వైపు చూడడానికి భయపడుతున్నారు.

మాటలతోనే పడేస్తాడు...


కృష్ణా జిల్లాకు చెందిన ఐతం రవి శేఖర్... 18 ఏండ్ల నుంచి మాయ మాటలతో నేరాలకు పాల్పడుతున్నాడు. తన పర్సనాల్టీని అవకాశంగా చేసుకుని అందర్నీ బురిడీ కొట్టిస్తున్నాడు. దీని కోసం అతను టిప్‌టాప్ డ్రెస్సింగ్, ఎదుటి వారిని ఎలా నమ్మించాలో మాటలను నేర్చుకున్నాడు. ఇలా అతను మొదట తన సొంత ఊరిలో ఉద్యో గం పెట్టిస్తానని మోసం చేశాడు. మాయ మాటలతో రైలు ప్రయాణం పరిచయంతో ఏకంగా వారింట్లో మూడు రోజుల పాటు బస చేసి.. స్థలం కొంటానని నమ్మించి ఖరీదైన కారునే కొట్టేశాడు. ఇలా.. జూన్ 26న హయత్‌నగర్‌లో బీఫార్మాసీ యువతిని కిడ్నాప్ చేసి పెద్ద సంచలనం సృష్టించాడు. అతను ఎక్కడ కూడా సెల్‌ఫోన్ వాడకుండా, తన నేరప్రక్రియ ఆధారాలు పోలీసులకు దొరకకుండా చూసుకునేవాడు.

రైతులు, అమాయకులే టార్గెట్...


ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన మర్రి నాగరాజు సెక్యూరిటీ గార్డు, ఉప్పల్‌కు చెందిన అల్లూరి విజయ్ ఆటో డ్రైవర్. అయితే వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ద్విచక్ర వాహనాల చోరీలకు పథకం చేశారు. చోరీ చేసిన వాహనాలను నగరంలో కాకుండా శివారు గ్రామాల్లో రైతులకు, అమాయకులకు అమ్మేవారు. మూడేండ్లలో రూ.28.70 లక్షల విలువ చేసే 55 ద్విచక్ర వాహనాలను చోరీ చేసి విక్రయించారు. ఎక్కడ కూడా తమ ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. పలువురి ఫిర్యా దుతో రంగంలోకి దిగిన సీసీఎస్ బృందానికి ఆ ఇద్దరు పట్టుబడ్డారు.

దృష్టి మళ్లించి దోచేస్తారు...


తమిళనాడు రాంజీనగర్ ముఠాలు.. వారి నేర ప్రక్రియలో ఎవర్నీ గాయపర్చారు. కేవలం సమయానుసారంగా డబ్బులు ఉన్న వారిని గుర్తించి.. దృష్టి మళ్లించి కొట్టేస్తారు. రాంజీనగర్‌లో మొత్తం 18 ముఠాలు ఉన్నాయి. ఇందులోని దీపూ గ్యాంగ్ .. వనస్థలిపురంలోని యాక్సిస్ బ్యాంక్ వద్ద ఏటీఎంలో నగదును డిపాజిట్ చేయడానికి వెళ్లినప్పుడు వ్యాన్‌లో కూర్చున్న సెక్యూరిటీ గార్డు దృష్టి మళ్లించిరూ. 59 లక్షలను కొట్టేశారు. సీసీకెమెరాల్లో నిందితులు చిత్రాలు దొరికినా.. వారిని పట్టుకునేందుకు 3 నెలల పాటు రాచకొండ ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు పని చేయాల్సింది. ఎట్టకేలకు ఆ ముఠా పోలీసులకు పట్టుబడ్డారు.

ప్రేమికులను బెదిరించి.. వసూళ్లు


నల్గొండ జిల్లాకు చెందిన చందు మొదట కారు డ్రైవర్. నగర శివారు ప్రాంతాలు తిరిగాడు. ఆ సమయంలో నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రేమికుల వ్యవహారాలను గమనించాడు. డ్రైవర్ డ్యూటీ అయిపోయిన తర్వాత.. నిర్మానుష్య ప్రాంతాలకు ద్విచక్ర వాహనంపై వెళ్లేవాడు. అక్కడ కనిపించిన ప్రేమికులను పోలీస్‌నంటూ బెదిరించి.. బంగారం, నగదు దోచేశాడు. ఇలా రెండేండ్ల పాటు సూడో పోలీస్‌గా ప్రేమికులను దోచుకున్నాడు. చివరకు అబ్దూల్లాపూర్ మెట్‌లో ఒకే రోజు రెండు ఘటనలకు పాల్పడడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. సగం నంబర్ బైక్ ఆధారంగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతను మొత్తం 30 మందికి పై దోచుకున్నాడని తేలింది.

నేరం జరిగితే దానికి శుభం పడాల్సిందే...


నేరం చోటు చేసుకుంటే.. దాని అంతు చూడడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం. దీంతో ప్రతి నేరంలో నిందితుల అరెస్ట్, వారికి శిక్ష ఖాయంగా మారింది. నేరస్థులు ఎన్ని ఎత్తులు వేసినా మేము కూడా పై ఎత్తులు వేసి పట్టుకుంటాం. ఇటీవల చోటు చేసుకున్న సంచలన కేసుల్లో నేరస్థులు అనేక ట్రిక్‌లను వాడారు. అయినా శాస్త్రీయంగా, సాంకేతికంగా అనేక ఆధారాలను సేకరించి వారిని అరెస్ట్ చేశారు. మేము సేకరించిన ప్రతి ఆధారం నిందితులకు శిక్ష ఖరారు చేస్తుందని నమ్మకం.
- మహేశ్ భగవత్, రాచకొండ సీపీ

మూడు నెలలు కష్టపడ్డాం...


రాంజీనగర్‌కు చెందిన దీపూ గ్యాంగ్ విసిరిన సవాల్‌ను ధైర్యంగా ఎదుర్కొన్నాం. సీపీ, ఉన్నతాధికారులు ఇచ్చిన ప్రోత్సాహంతో 3 నెలలు పాటు ప్రతి నిమిషం వారి ఆధారాలను విశ్లేషించాం. ఏ ఒక్కటిని నిర్లక్ష్యం చేయలేదు. ప్రతి సమాచారాన్ని కీలకంగా భావించి 40 రోజుల పాటు రాంజీనగర్ పరిసరాల్లో బస చేశాం. దీపూ గ్యాంగ్‌ను పట్టుకోలేరనే ధీమాను నిలువరించాం.
- రవికుమార్, ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఓటీ రాచకొండ

బైక్ నంబర్ ప్లేట్‌ను వంచేశాడు...


ఇటీవల అబ్దూల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలో ఒకే రోజు రెండు ప్రేమ జంటలను గుర్తు తెలియని వ్యక్తి పోలీసంటూ దోచుకున్నాడనే ఫిర్యాదులు అందా యి. రంగంలోకి దిగి.. సీసీ కెమెరాల్లో నిందితుడు ఉపయోగించిన బైక్ నంబర్ ప్లేటు కనపడకుండా వంచేశాడు. దీంతో ఆ వాహనం యజమానిని గు ర్తించడం చాలా కష్టమైంది. నంబర్ ప్లేట్‌తో పాటు బాధితుల నుంచి వచ్చిన సమాచారంతో వివిధ కోణాల్లో శోధించి కీలకాధారాలు సేకరించాం.
- రాములు, ఇన్‌స్పెక్టర్ సీసీఎస్ రాచకొండ

1366
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles