కోర్ హీట్ వేవ్ జోన్‌లో తెలంగాణ.. మరో రెండు రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు

Wed,May 15, 2019 02:32 PM

next two days there will be high temperature in telangana state

హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ ఎండలు విజృంభించాయి. ఒకటి రెండు రోజులు వర్షంతో భానుడు కాస్త చల్లబడినప్పటికీ.. మళ్లీ ఎండ దంచుతోంది. మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కోర్ హీట్ వేవ్ జోన్‌లో రాష్ట్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాజస్థాన్ వైపు నుంచి వడగాలులు వీస్తున్నాయి. ఎండ తీవ్రతకు వడగాలులు తోడవడంతో ఎండలో తిరిగే పరిస్థితి కనిపించడం లేదు. సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. కరీంనగర్, భూపాలపల్లి, నల్గొండలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. దీంతో అత్యవసరం అయితే తప్ప పగటిపూట బయటికి వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ అత్యవసరంగా పగలు బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలిన వైద్యులు చెబుతున్నారు.

2039
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles