75 గజాల్లోపు ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరం లేదు...

Sun,September 22, 2019 04:12 PM

హైదరాబాద్ : ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నా... మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అర్హులేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పనితీరుపై మూడు నెలలకోసారి మానిటరింగ్ ఉంటుందని తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా పనిచేయని వారిపై వేటు పడుతుందని వెల్లడించారు. 75 గజాల లోపు స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా ఇల్లు కట్టుకోవచ్చని తెలిపారు. 76 నుంచి 600 గజాల ఇంటిస్థలం ఉన్నవారు ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాలి.


ఇంటి నిర్మాణానికి 21 రోజుల్లో అనుమతి ఇస్తాం. ఎవరైనా అకారణంగా అనుమతి నిలుపుదల చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంటి అనుమతి తీసుకుని 6 నెలల్లో నిర్మాణం ప్రారంభించకపోతే అనుమతి రద్దవుతుంది. అనుమతి తీసుకున్న మూడేళ్లలో మొత్తం ఇల్లు పూర్తి చేయాలి. కొత్తగా ఏర్పడిన 68 మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్ పద్ధతి తీసుకువస్తామన్నారు. రాజకీయ పార్టీలు ఒప్పుకుంటే రోడ్లపై ఉన్న ప్రార్థనా మందిరాలను తరలిస్తామని చెప్పారు.

3617
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles