శ్రీరామ నవమి శోభాయాత్రపై అధికారుల సమీక్ష

Fri,April 12, 2019 06:25 PM

హైదరాబాద్: ఈ నెల 14న హైదరాబాద్‌లో జరగనున్న శ్రీరామ నవమి శోభాయాత్రపై జీహెచ్‌ఎంసీ, పోలీస్ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం శోభాయాత్ర మార్గాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పరిశీలించారు. శోభాయాత్ర మార్గంలో సీసీటీవీ కెమెరాలు, మంచినీటి సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అధికారులు చర్చించారు. స్ట్రీట్ లైట్లు పోయిన చోట పునరుద్ధరించాలని సిబ్బందికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశించారు.

1078
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles