సిద్దిపేట కలెక్టర్ గా వెంకట్రామిరెడ్డి బాధ్యతల స్వీకరణ

Wed,June 12, 2019 11:07 AM

P venkatramireddy take oath as siddipet collector


సిద్దిపేట: సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గా పి.వెంకట్రామి రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ ఆఫీసులో కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి ఈ సందర్భంగా వేదపండితులు ఆశీర్వచనం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన విషయం తెలిసిందే.

సిద్దిపేట జిల్లాకు వెంకట్రామిరెడ్డిని, రాజన్న సిరిసిల్ల జిల్లాకు కృష్ణ భాస్కర్‌ను కలెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా కృష్ణభాస్కర్‌, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా వెంకట్రామిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల చేపట్టిన బదిలీల్లో ఇద్దరు కలెక్టర్లకు వారి పూర్వస్థానంలోనే బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

1333
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles