ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్..ఐదుగురికి మెమోలు

Thu,June 20, 2019 09:11 PM


నాగర్‌కర్నూల్ : విధుల్లో నిర్లక్ష్యం చేసిన ఇద్దరు పంచాయతీ సెక్రెటరీలపై సస్పెన్షన్ వేటు పడింది. కల్వకుర్తి మండలంలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ సెక్రెటరీ ఈశ్వరయ్యను, అచ్చంపేట మండలం హాజీపూర్ పంచాయతీ సెక్రెటరీ లక్ష్మణ్ ను సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కల్వకుర్తి ఈఓఆర్డీ మల్లికార్జున్ రెడ్డితోపాటు, ఐదుగురు పంచాయతీ సెక్రటరీలకు జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ ఛార్జిమెమోలు జారీ చేశారు.


విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అలసత్వం ప్రదర్శించడంతో వారిపై చర్యలు తీసుకున్నామని జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ తెలిపారు. జిల్లాలో 100% వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని, పంచాయతీ సెక్రటరీలు తమ విధుల్లో ఎక్కడ అలసత్వం ప్రదర్శించరాదని ఆయన నిర్దేశించారు. రానున్న హరితహారం కార్యక్రమం మరియు స్వచ్ఛభారత్ కింద నిర్మించనున్న వ్యక్తిగత మరుగుదొడ్లను వేగవంతంగా పూర్తి చేసేలా ప్రతి ఒక్కరు పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

6674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles