పార్టీ ఆశయాల సాకారానికి కలిసి పనిచేయాలి: ఎంపీ కవిత

Fri,March 22, 2019 08:35 PM

party workers should work together to fulfill wishes of the trs party says mp kavitha

నిజామాబాద్: టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అదేవిధంగా ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన వాళ్ళు పాలు- నీళ్లలా కలిసిపోయి పని చేయాలని ఎంపీ కవిత అన్నారు. ఒక మంచి ఆశయంతో పార్టీలో చేరిన వారు వారి లక్ష్య సాధనతో పాటు పార్టీ ఆశయాలను నెరవేర్చేందుకు కలిసి పని చేయాలన్నారు. నిజామాబాద్ జిల్లా టిడిపి అధ్యక్షుడు బాగారెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం టిడిపి ఇంచార్జి తారా చంద్, అనుచరులు నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ లో చేరిన వారిలో కాంగ్రెస్, టిడిపిలకు చెందిన సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపిటిసి లు, మాజీ ఎంపిటిసి లు, వార్డు సభ్యులు, గ్రామ శాఖల బాధ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ సిఎం కేసీఆర్ ఆలోచనా విధానంను దేశమంతటికీ తెలియజెప్పెందుకు పార్లమెంట్ ఎన్నికలను ఉపయోగించుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్ అని అన్నారు.


రైతు బంధు ద్వారా రూ.5 వేలు చొప్పున రెండు పంటలకు రూ. 10 వేలు ఇస్తామని సీఎం చెప్పిన విషయం తెలిసిందేన్నారు. బిజెపి దేశమంతటా ఇస్తామంటోంది అన్నారు. మన ప్రభుత్వం మన రైతులకు కాకుండా దేశంలోని రైతులందరికీ మేలు చేసినట్లయింది అని ఎంపి కవిత వివరించారు. మన పథకాలకు కేంద్రం డబ్బు ఇస్తోందని బిజెపి ప్రచారం చేస్తోంది. అవాస్తవం అయిన ఈ విషయంను ప్రజలకు విడమర్చి చెప్పాలని కోరారు. తెలంగాణ గోస తెలిసి వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఎంపి ఎన్నికల నుండి ఎంపిటిసి ల వరకు .. ఏ ఏన్నికలైనా గెలుపు టిఆర్ఎస్ అభ్యర్థులదే అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు విజి గౌడ్, ఆకుల లలిత, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాంకిషన్ రావు, దాదన్న గారి విఠల్ రావు, ఈగ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

957
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles