గ్రీన్ ఛాలెంజ్ తో మొక్క నాటిన పరుచూరి గోపాలకృష్ణ

Tue,October 15, 2019 08:37 PM


రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతున్నది. ప్రజలు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినీ దర్శకుడు ఎన్ శంకర్ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి..మొక్కను నాటారు. అనంతరం ఆ మొక్కకు దండం పెట్టారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటాల్సిందిగా వి.వి వినాయక్‌తో పాటు మరికొందరికి పరుచూరి గోపాలకృష్ణ ఛాలెంజ్ విసిరారు. హరిత తెలంగాణ చేసేందుకు గొప్ప కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్‌ కుమార్‌ను పరుచూరి గోపాలకృష్ణ అభినందిస్తూ ట్వీట్‌ చేశారు.



పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్‌కు ఎంపీ సంతోష్ కుమార్ స్పందిస్తూ..మొక్క నాటి ఆ మొక్కను పూజించడం పరుచూరి వ్యక్తిత్వానికి నిదర్శనమంటూ రీ ట్వీట్‌ చేశారు.



726
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles