పింఛన్‌దారులు వార్షిక ధ్రువీకరణ పత్రం సమర్పించాలి

Fri,November 1, 2019 08:17 AM

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పరిధిలోని పింఛన్ చెల్లింపు కార్యాలయం ద్వారా పింఛన్ పొందుతున్న ప్రభుత్వ సర్వీసు, కుటుంబ పింఛన్‌దారులు వార్షిక ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సంయుక్త సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నవంబర్ 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు వార్షిక ధ్రువీకరణ పత్రం, కొత్త పాస్‌పోర్టు సైజు ఫొటో అంటించి సంబంధిత బ్యాంకు అధికారిచే కానీ, ప్రభుత్వ గెజిటెడ్ అధికారిచే కానీ సంతకం చేయించి నేరుగా పోస్టు ద్వారా సంబంధిత సహాయ పింఛన్ చెల్లింపు కార్యాలయంలో సమర్పించాలన్నారు. వార్షిక ధ్రువీకరణ పత్రం, టీ-యాప్ పోలియా, స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. మీ-సేవలో బయోమెట్రిక్ పద్ధతి, జీవన్ ప్రమాణ్ ద్వారా సమర్పించవచ్చని తెలిపారు.

3436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles