ఎంపీగా వినోద్ కుమార్ ను లక్ష మెజార్టీతో గెలిపించాలి..

Thu,March 14, 2019 06:54 PM

People should elects Vinodkumar as MP with High Majority


కరీంనగర్ : ఉద్యమాలకు మొదట నుండి అండగా ఉండి..ఊపిరి పోసింది హుజురాబాద్ నియోజకవర్గమేనని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.కేసీఆర్ ప్రతీ సమావేశంలో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా పాల్గొని విజయవంతం చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 17న కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో..టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఈటల రాజేందర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ సభ జరుగుతుందని, ఎంపీగా వినోద్ కుమార్ గారినే గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీని నమ్ముకున్న వారికి, పార్టీ పుట్టినప్పటి నుండి ఉన్నవారికి తగిన విలువ, ప్రాధాన్యం తప్పక ఉంటుంది. నాకు గ్రూపులు లేవు..కల్మషం లేదు..ఒకే తల్లీ పిల్లలలాగా కలిసి ఉందాం. అందరూ నా వాళ్లే అనుకోని ముందుకు వెళదామని మంత్రి ఈటల సూచించారు. ఈ నియోజకవర్గంలో 81.6% శాతం టీఆర్ఎస్ పార్టీ ఉందని కేసీఆర్ అన్నారు..కానీ మొన్న ఫలితాలు నిరాశ పరిచాయి. నాకు వెన్నుపోటు పొడిచారు..కానీ టీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడవకండని ఈటల విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ఈటల కోరారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి తప్పా..ఇతర పార్టీలకు డిపాజిట్ కూడా దక్కదని ధీమా వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గ ప్రజలు ఒక లక్ష ఓట్ల మెజారిటీతో ఎంపీగా వినోద్ కుమార్ ను గెలిపించాలని మంత్రి ఈటల పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

1991
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles