గన్‌మెన్లను వెనక్కి పంపిన ఎమ్మెల్యే రేగా

Wed,August 14, 2019 08:45 PM

pinapaka mla rega kantha rao returned his gunmen to government

మణుగూరు : ప్రజలతో మమేకమయ్యేందుకు అన్ని గ్రామాల్లో ప్రజలను స్వచ్ఛందంగా కలుసుకొని స్వాతంత్య్ర దినోత్సవం నుంచి స్వేచ్ఛగా ఉండాలని తన గన్‌మెన్లను వెనక్కి పంపినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. హంగుఆర్భాటాలతో ప్రజల్లోకి వెళ్లడం ఇష్టంలేదని అందుకే తన గన్‌మెన్‌లను ఆరుగురిని వెనక్కి పంపడం జరిగిందన్నారు. తన నిర్ణయం వెనుక ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గన్‌మెన్లను వెనక్కి పంపే నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తనకు ప్రతి పల్లెలో పరిచయాలు ఉన్నాయని, ఎలాంటి ప్రాణభయం లేదని, ఎప్పుడు తప్పు చేయలేదని, తన నియోజకవర్గ ప్రజలే తనకు రక్ష అని చెప్పారు. ఈ నెల 15నుంచి తనకు ప్రభుత్వం కేటాయించిన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెనక్కి పంపుతున్నట్లు చెప్పారు.

2206
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles