ప్రజలు ఆశించిన మేరకు సుపరిపాలన అందిస్తాం: మోడీ

Thu,August 15, 2019 08:13 AM

PM Narendra Modi in his address to the nation on 73rd India Independence Day

ఢిల్లీ: ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈ స్వతంత్య్రం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ...స్వాతంత్య్రం అనంతరం శాంతి, సమృద్ధి, భద్రతకు అందరూ కృషి చేశారు. అమరవీరుల త్యాగాలను దేశప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. పలు ప్రాంతాల్లో వరదల వల్ల ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మాకు అవకాశం ఇచ్చారు. ప్రజలు ఆశించిన మేరకు సుపరిపాలన అందిస్తాం. ప్రజల ఆకాంక్షల మేరకు చట్టాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలను గాడిలో పెట్టాం. వేగవంతంగా పనిచేసేలా ముందుకు వెళ్తున్నాం.

ప్రజల ఆకాంక్షల మేరకే ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేశాం. సాగునీటి వనరుల అభివృద్ధికి జల్‌శక్తి అభియాన్ ఏర్పాటు చేశాం. వైద్య, ఆరోగ్య రంగంలో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చాం. వచ్చే ఐదేళ్లకు లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ప్రగతిపథంలో ముందుకెళ్తున్నాం. ప్రభుత్వ ఏర్పడిన 10 వారాల్లోనే ప్రజలకు మేలుచేసే కీలక నిర్ణయాలు తీసుకున్నాం. తలాక్ చట్టం ద్వారా ముస్లీం మహిళలకు సాధికారత కల్పించాం. రాజ్యంగ స్పూర్తితో ముస్లీం మహిళలకు సమాన హక్కులు కల్పించాం. 70 ఏళ్లలో చేయలేకపోయిన పనిని 70 రోజుల్లో చేసి చూపించాం. జమ్మూ కశ్మీర్, లడక్‌లో శాంతి స్థాపనే మా లక్ష్యం. అన్ని పార్టీలు ఆర్టికల్ 370 రద్దును సమర్థించాయి. ఆర్టికల్ 370 రద్దు చేసి సర్ధార్ వల్లాబాయ్ పటేల్ ఆకాంక్షను నెరవేర్చాం.

ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీలకు పూర్తి స్వేచ్ఛ లభించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లభించింది. జమ్ము కశ్మీర్‌లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు దక్కాయి. గత ప్రభుత్వాలు ఆర్టికల్ 370పై ఎందుకు నిర్ణయం తీసుకోలేదు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ ప్రజలకు అంతగా మేలు చేసేవే ఐతే స్వతంత్య్ర భారత దేశంలో 70 ఏండ్లుగా కశ్మీరీల జీవితాల్లో ఎందుకు మార్పు రాలేదు. అందుకే ఒకే జాతి- ఒకే రాజ్యంగం ఉండాలని దేశ ప్రజలతో పాటు కశ్మీరీ ప్రజలు కూడా అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

578
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles