గర్భస్రావం చేస్తుండగా విద్యార్థిని మృతి...

Tue,September 10, 2019 07:25 PM

వికారాబాద్: రంగంపల్లి వద్ద యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మరణించిన యువతి కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన డిగ్రీ విద్యార్థినిగా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే యువతి హత్యకు కారణమని పరిగి పోలీసులు తేల్చారు. ఈ నెల 5వ తేదీన రంగంపల్లి గేటు వద్ద యువతి మృతదేహాం గుర్తించిన సంగతి తెలిసిందే. గుల్బర్గాలో గర్భస్రావం చేస్తుండగా విద్యార్థిని మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. శవాన్ని రంగంపల్లి వద్దకు తీసుకువచ్చిన ప్రియుడు మృతదేహాన్ని పెట్రోలు పోసి నిప్పంటించాడు. హత్య కేసుగా నమోదు చేసుకున్న తెలంగాణ, గుల్బర్గ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

48559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles