చిన్నారి మృతికి కారణమిదే..

Fri,November 8, 2019 06:49 AM


హైదరాబాద్ : తల్లి ఒడిలో నుంచి ఎగిరి బయట పడి తీవ్రగాయాలకు గురై.. రెండున్నర సంవత్సరాల పాప మరణించిన ఘటనలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే కారణమని సైబ రాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు విశ్లేషించారు.


వివరాల్లోకి వెళ్లితే.. ఈ నెల 5న వడ్డే భీమయ్య, భార్య సు హాసిని, పిల్లలు ప్రణతి, అర్చణ, మేఘనలతో కలిసి కారులో వనపర్తి నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. చటా న్‌పల్లి శివారు ప్రాంతం వద్దకు రాగా కారు ఎడమ భాగం ముందు టైరు పేలిపోయింది. దీంతో ముందు సీటులో తల్లి ఒడిలో ఉన్న రెండున్నర సంవత్సరాల ప్రణతి కారు కిటికీ నుంచి బయట పడి తీవ్ర గాయాలై మృతి చెందింది. అయితే మిగతా వారికి గాయాలు అయ్యి దవాఖానలో చికిత్స పొం దుతున్నారు. ఈ ఘటనలో తల్లి సీటు బెల్టు పెట్టుకోవడంతో గాయాలతో బయటపడింది. ప్రణితకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆమె బయటకు ఎగిరి పడిందని పోలీసులు తేల్చారు.

732
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles