పల్లెలు పచ్చగుండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం

Fri,September 13, 2019 08:55 PM

ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ పల్లె పచ్చగా ఉండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. వైరా మండలంలోని రెబ్బవరం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళాక గ్రామసభకు హాజరైన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణలు గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


మంత్రి అజయ్‌కుమార్‌ కొడవలితో రోడ్ల వెంట పిచ్చి మొక్కలను తొలగించారు. అదేవిధంగా రోడ్ల వెంట మంత్రి మొక్కలు నాటారు. అనంతరం పల్లెప్రగతి గ్రామసభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లెల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో సిరి సంపదలతో కళ, కళాలడాలన్న ముఖ్యమంత్రి స్వప్నాన్ని ప్రతీ ప్రజాప్రతినిధి, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో నిజం చేయాలన్నారు. గ్రామంలో ప్రజలు చైతన్య వంతంగా ఆలోచన చేసి నివాసాలలో ఉన్న మురుగు నీరు, ఇతర వ్యర్థాలు వంటి వాటి నిర్వాహణలో అధికారుల సూచనలు సలహాలను పాటించాలన్నారు. గ్రామ ప్రజలు కలిసి కట్టుగా పని చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉండే విధంగా సహకరించాలని పిలుపు నిచ్చారు. అలాగే జిల్లాలో జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ఆధ్వర్యంలో జేసీ అనురాగ్‌జయంతి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హనుమంతుకొడింబా, సీఈవో ప్రియాంక తదితరులు విస్తృతంగా పర్యటించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాలు, మార్గదర్శకాలు మండల, గ్రామ ప్రత్యేక అధికారులకు అందిస్తున్నారు. పనుల పురోగతి నివేధికలను ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నారు.

618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles