స్పోర్ట్స్ స్కూల్‌లో చేరేందుకు అర్హతలు ఇవే....

Sun,May 26, 2019 08:18 AM

qualifications to join telangana sports school

శామీర్‌పేట : తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల ఆణి ముత్యాలను వెలికితీస్తున్నది. చదువుతో పాటు విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నది. క్రీడా పాఠశాలలో సీటు కొడితే... భవిష్యత్ బంగారు బాటే అన్న తీరుకు అద్దం పడుతున్నది. 4వ తరగతిలో ప్రతిభా సామర్థ్యాలు ఉన్న బాల బాలికలకు ప్రవేశం కల్పించి, క్రీడా ప్రతిభ ఆధారంగా ఆయా క్రీడా ఆంశాల్లో రాణించేందుకు పాఠశాల కృషి చేస్తున్నది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలో ఉన్న తెలంగాణ క్రీడా పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబర్చి దేశానికి పేరుకు తీసుకువచ్చారు. ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న చరిత్ర ఈ పాఠశాల విద్యార్థికి ఉంది. క్రీడల్లోనే కాకుండా పదవ తరగతి, ఇంటర్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారు ఎంతో మంది ఉన్నారు. ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. అయితే చాలా మందికి ప్రవేశాలు ఏ తరగతిలో జరుగుతాయి. ఎలాంటి సామర్థ్యాలు ఉండాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి తదితర విషయాలపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో పాఠశాలలో చేరలేకపోతున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశాలు ప్రారంభమైన తరుణంలో అందిస్తున్న ప్రత్యేక కథనం..

ఆగస్టులో ప్రవేశాలు


తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్‌లో వచ్చే విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో ప్రవేశానికి 01-09-2010 నుంచి 31-08-2011 మధ్య పుట్టి ఉండాలి. జూన్ 19వ తేదీలోపు మండల స్థాయిలో, జూన్ 26 నుంచి జులై 3వ తేదీ వరకు డివిజన్ స్థాయిలో, జులై 11 నుంచి 20 వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపికకు ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్టు మొదటి వారంలో ప్రవేశం కల్పిస్తారు.

120 మందికి అవకాశం


తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటికి చెందిన తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలు రాష్ట్రంలో మూడు ఉన్నాయి. 1. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్-హకీంపేట 2. రీజినల్ స్పోర్ట్స్ స్కూల్-కరీంనగర్ 3. రీజినల్ స్పోర్ట్స్ స్కూల్-అదిలాబాద్. ఒక్కో పాఠశాలలో 40 మంది(20 బాలురు, 20 బాలికలు) చొప్పున మొత్తం 120 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. 2019-20 సంవత్సరానికి కూడా 120 మంది ఎంపిక లక్ష్యంగా ప్రవేశాలు నిర్వహించనున్నారు. పరీక్షలు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉంటాయి.

కావాల్సిన ధ్రువపత్రాలు :


1. ప్రస్తుత స్కూల్ ధ్రువీకరణ పత్రం
2. పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం(తహసీల్దార్, పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్)
3. 10 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు
4. 3, 4 తరగతుల ప్రగతి పత్రం
5. ఆధార్ కార్డు
6. కుల ధ్రువీకరణ పత్రం

విద్యార్థులకు ఎత్తు, బరువు, 30 మీటర్ల ైఫ్లెయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బోర్డ్ జంప్, 800 మీటర్ల రన్నింగ్, 6*10 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్ ఫుట్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటి పరీక్షలతో పాటు ఆరోగ్య, వయస్సు ధ్రువీకరణ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఎంపిక శిబిరం తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట ప్రాంగణంలో జరుగుతుంది.

బాలురు


* ఎత్తు : 127-133 సెం.మీ ఉంటే పర్వాలేదు, 134-141 ఉంటే గుడ్, 142 ఎక్కువ ఉంటే వెరీగుడ్
* బరువు : 24-28 కిలోలు పర్వాలేదు, 29-32 కిలోలు, 33 ఎక్కువ వెరీగుడ్
* 30 మీటర్ ైఫ్లెయింగ్ స్టార్ట్ : 5.3-4.8 పర్వాలేదు, గుడ్ 4.7-4.5. వెరీగుడ్ 4.4 తక్కువ (ఎస్‌ఈసీ)
* స్టాండింగ్ బోర్డ్ జంప్ : 164-183 పర్వాలేదు, గుడ్ 184-193. వెరీగుడ్ 194 ఎక్కువ(సీఎంఎస్)
* 6*10 ఎం షటిల్న్ : 18.3-17.5 పర్వాలేదు, గుడ్ 17.4-16.5. వెరీగుడ్ 16.4 తక్కువ (సీఎంఎస్)
* మెడిసిన్ బాల్‌ఫుట్ : 2.26- 2.50 పర్వాలేదు, గుడ్ 2.51- 2.76. వెరీగుడ్ 2.77 ఎక్కువ (ఎంటీఆర్)
* 800 మీటర్ల రన్నింగ్ : 3.40- 33.24 పర్వాలేదు. గుడ్ 3.23- 3.07. వెరీగుడ్ 3.06 తక్కువ ( నిమిషాలు, సెకండ్లు)
* ఫ్లెక్సిబిలిటి : 4-6 పర్వాలేదు, గుడ్ 7-9. వెరీగుడ్ 10 ఎక్కువ(సీఎంఎస్)
* వర్టికల్ జంప్ : 30-3 పర్వాలేదు. గుడ్ 33-35. వెరీగుడ్ 36 ఎక్కువ (సీఎంఎస్)

బాలికలు
* ఎత్తు : 124-133 పర్వాలేదు. గుడ్ 134-139. వెరీగుడ్ 140 ఎక్కువ (సీఎంఎస్)
* బరువు : 23-26 పర్వాలేదు. గుడ్ 27-30. వెరిగుడ్ 31 ఎక్కువ (కేజీ)
* 30 మీటర్ ైఫ్లెయింగ్ స్టార్ట్ : 5.6-5.2 పర్వాలేదు, గుడ్ 5.1- 4.7, వెరీగుడ్ 4.6 తక్కువ (ఎస్‌ఈసీ)
* స్టాండింగ్ బోర్డ్ జంప్ : 151-170 పర్వాలేదు, గుడ్ 171-180, వెరీగుడ్ 181 ఎక్కువ(సీఎంఎస్)
* 6*10 ఎం షటిల్న్ : 19.3-18.3 పర్వాలేదు, గుడ్ 18.2-17.2. వెరీగుడ్17.1 తక్కువ (సీఎంఎస్)
* మెడిసిన్ బాల్‌ఫుట్ : 1.18- 2.13 పర్వాలేదు, గుడ్ 2.14- 2.47, వెరీగుడ్ 2.48 ఎక్కువ (ఎంటీఆర్)
* 800 మీటర్ల రన్నింగ్ : 4.03- 3.40 పర్వాలేదు, గుడ్ 3.39- 3.20. వెనీగుడ్ 3.19 తక్కువ (నిమిషాలు, సెకండ్లు)
* ఫ్లెక్సిబిలిటి : 4-6 పర్వాలేదు, గుడ్ 7-10. వెరీగుడ్ 11 ఎక్కువ(సీఎంఎస్)
* వర్టికల్ జంప్ : 26-29 పర్వాలేదు, గుడ్ 30-33, వెరీగుడ్ 34 ఎక్కువ (సీఎంఎస్)

3219
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles