రేడియేషన్ ప్రమాదమే..!

Tue,May 9, 2017 10:19 AM

radiation is dangerous

ప్రస్తుతం సమాజంలో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా సాంకేతిక పరికరాలు ముగింట్లోకి రావడంతో వాటిని వినియోగించుకోవడం తప్ప వాటివల్ల జరిగే ప్రమాదాలు, ఇబ్బందులను లక్ష్యపెట్టకుండా ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఈరోజుల్లో సెల్‌ఫోన్ వినియోగం మరీ బాగా పెరిగిపోయింది. సెల్ లేనివారంటూ లేరు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఈ సెల్‌ఫోన్లు వినియోగదారులకు రేడియేషన్‌తో ప్రమాదం పొంచి ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మనం పరిశీలిస్తే..

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* రెండు నిమిషాలు మాట్లాడితే మెదడులో జరిగే విద్యుత్ ప్రకంపనలు ఒక గంట వరకు ఉంటాయట. అందుకే వీలైనంత తక్కువగా వాడడం మంచిది.
* సెల్‌ఫోన్ అందుబాటులో ఉంచకపోవడమే మేలు. తప్పని పరిస్థితుల్లో ఫోన్ వాడాల్సి వస్తే ఇయర్‌ఫోన్స్‌తో మాట్లాడించడం మంచిది. అది కూడా చాలాతక్కువ సమయం మాత్రమే.
* హెడ్‌సెట్ వినియోగించేటప్పుడు ఎయిర్‌ట్యూబ్ హెడ్‌సెట్ వాడటం మంచిది. ఎందుకంటే మామూలు పేర్లతో ఉండే హెడ్‌సెట్లు యాంటినా వలె పనిచేసి చుట్టుపక్కల ఉన్న ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఫీల్డులన్నింటినీ గ్రహిస్తాయి.
* మాట్లాడాలనుకున్నప్పుడు డయల్ చేయగానే కాకుండా కనెక్ట్ అయిన తర్వాత చెవికి ఆన్చడం అలవాటు చేసుకోవాలి.
* తక్కువగా ఉన్నప్పుడు ఫోన్ వినియోగించకపోవడం మంచిది. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో ఫోన్ తన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించి మరో ఫోన్‌తో కనెక్ట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి రేడియేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది.
* ఎల్‌ఏఆర్(స్పెసిఫిక్ అబ్సాషన్‌రేట్) ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేయడం ఉత్తమం. లేదంటే తక్కువ రేడియేషన్ ఉన్న సెల్‌ఫోన్ కొనడం మంచిది. ఈ వివరాలు మొబైల్ ఫోన్ మాన్యువెల్‌లో ఉంటాయి. రేడియేషన్ ఫ్రిక్వెన్సీ రేటు ఎంత తక్కువగా ఉంటే అంత మేలు.
* మహిళలు సెల్‌ఫోన్ల వినియోగం చేసినైట్లెతే రేడియేషన్‌తో పుట్టబోయే పిల్లలకు పలురకాల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
* బ్యాటరీ చార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్ వినియోగించడం సురక్షితం కాదు. పేలే అవకాశాలు ఎక్కువ. ఫోన్ ఎప్పటికప్పుడు పూర్తిగా చార్జింగ్ చేసి పెట్టుకోవడం మంచిది.
* ఇలా చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తూ రేడియేషన్ బారి నుంచి తప్పించుకుంటూ ఆనందంగా సెల్‌ఫోన్ వినియోగించుకోవచ్చు.

1255
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles