అవినీతికి పాల్పడిన సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్

Wed,August 14, 2019 08:38 PM

Senior Assistant suspended in  Corruption case

వైరా : ఖమ్మం జిల్లా వైరాలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అవినీతికి పాల్పడిన సీనియర్ అసిస్టెంట్ ఖదీర్‌పై సస్పెండ్ వేటు పడింది. ఖదీర్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ డీఆర్‌వో ఎన్.సైదిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన షేక్ గౌస్‌పాషా కుమార్తె వివాహాన్ని రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వెళ్లగా అతని వద్ద నుంచి ఖదీర్ చలానా పేరుతో రూ.3500 వసూలు చేశాడు. ముస్లింల వివాహ స్పెషల్ రిజిస్ట్రేష న్‌కు కేవలం రూ.20 చలానా మాత్రమే చెల్లించాలని తెలుసపుకున్న గౌస్‌పాషా సీనియర్ అసిస్టెంట్ అవినీతి అక్రమాల గురించి మీడియాకు వివరించాడు. ఖదీర్‌ను గౌస్‌పాషా తాను రెండు దఫాలుగా ఇచ్చిన రూ.3500 నగదుకు కట్టిన చలానాలు ఇవ్వాలని నిలదీశాడు. దీంతో ఖదీర్ గౌస్‌పాషాకు తిరిగి రూ.3500 నగదు చెల్లించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన గౌస్‌పాషా ఖదీర్‌కు నగదు ఇచ్చేందుకు తన భార్య వెండి పట్టీలు తాకట్టు పెట్టాడు. ఈ విషయాన్ని గ్రామస్తులు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు విచారణ జరిపి సస్పెండ్ వేడు వేశారు. వైరాలో పనిచేసిన నాలుగేళ్ల కాలంలో ఖదీర్ రెండవ సారి సస్పెండ్ కావటం విశేషం. సర్వీసులో మొత్తం మూడుసార్లు ఖదీర్‌పై సస్పెండ్ వేటు పడింది.

868
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles