TELANGANA POLYCET RESULTS 2019

పాయలన్నీ ఒక్కటై టీఆర్‌ఎస్ జీవధారలో కలుస్తున్నయి: కేటీఆర్

Fri,March 22, 2019 08:00 PM

Shadnagar ex mla pratap reddy joins in TRS party

హైదరాబాద్: అన్ని పాయలు ఒకటై టీఆర్‌ఎస్ అనే జీవధారలో కలుస్తున్నయని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో నేడు చేరారు. అందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించిన కేటీఆర్ అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నరన్నారు. టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటెయ్యాలో ఒక్కమాటలో చెప్పొచ్చన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్‌గాంధీకి లాభం. బీజేపీకి ఓటేస్తే నరేంద్రమోదీకి లాభం. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే తెలంగాణ గడ్డకు లాభమన్నారు. 16 ఎంపీలు చేతిలో ఉంటే తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం మెడలు వంచి తెచ్చుకోవచ్చని తెలిపారు. కల్వకుర్తి లిఫ్టు పూర్తికావడంతో చెరువులన్నీ కళకళలాడుతున్నయి. పల్లెపల్లెనా పల్లేర్లు మొలిచే అని పాలమూరు గురించి పాటలు పాడుతారు. ఇప్పుడు పాలమూరు పచ్చపడుతుంటే కడుపు నిండుతున్నది. ఇప్పటిదాకా జరిగింది కొంతే.. ఇంకా జరగాల్సింది ఎంతో ఉందన్నారు. రూ. 40 వేల కోట్ల పైచిలుకు ఖర్చుపెట్టి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తున్నాం. పేదవాడికి అండగా నిలబడ్డ ముఖ్యమంత్రికి మనమంతా అండగా ఉండాలన్నారు. ఎవరూ ఊహించని విధంగా 24 గంటల కరెంటు సాధ్యమైంది. కేసీఆర్ లాంటి నాయకుడు ఉన్నందుకు గర్వంగా ముందుకు పోదామని పిలుపునిచ్చారు.
మోదీ వేడి తగ్గింది.. రాహుల్ నాయకత్వం గాడి తప్పింది
పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చినట్లే కాళేశ్వరం ప్రాజెక్టుకో పాలమూరు ఎత్తిపోతల పథకానికో జాతీయ హోదా ఇవ్వమని అడిగితే కేంద్రం చడీచప్పుడు చేయలేదని కేటీఆర్ అన్నారు. ఏ సర్వే చూసినా మోదీ వేడి తగ్గిందని.. రాహుల్‌గాంధీ నాయకత్వం గాడి తప్పిందని అర్థమౌతుందన్నారు. 16 మంది ఎంపీలు ఢిల్లీలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తే పాలమూరు లాంటి ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయన్నారు. ఎవరి దగ్గరి కర్ర ఉంటే వాళ్లదే బర్రె అన్నట్టుంది. ఎవరు రైల్వేమంత్రి అయితే వాళ్ల ప్రాంతానికే రైలు వెళ్తుంది. మోదీ గుజరాత్‌కి చెందిన వ్యక్తి కాబట్టి బుల్లెట్ రైలు గుజరాత్ వెళ్తుంది అన్నారు. ఢిల్లీని శాసించే నాయకుడు కావాలి. బీజేపీ అయినా.. కాంగ్రెస్ అయినా ఢిల్లీ గులాంలే. ఢిల్లీ ఉస్కో అంటే ఉస్కో.. డిస్కో అంటే డిస్కో. ఢిల్లీ గులాంలు కావాలా.. తెలంగాణ గులాబీలు కావాలా తేల్చుకోవాలన్నారు. పీసీసీ అధ్యక్షుడి సొంత ఇలాఖాలో పునాదులు కదిలిపోతున్నయన్నారు. ఈ చేరికలతో షాద్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌కు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్నారు. ఎంపీ ఎన్నికల్లో షాద్‌నగర్ నుంచి 50 వేల ఓట్ల మెజారిటీ రావాలన్నారు. పార్లమెంట్‌కు 16 మంది టీఆర్‌ఎస్ సైనికులను పంపిద్దామన్నారు. సారు, కారు, పదహారు.. ఢిల్లీలో సర్కారు దిశగా ముందుకుపోదామన్నారు. పాలమూరు పౌరుషం చూపిస్తారనే నమ్మకం తనకుందని కేటీఆర్ అన్నారు.

1687
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles