శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు స్వల్ప ఇన్‌ఫ్లో

Mon,October 14, 2019 08:01 AM

మెండోరా: ఉత్తర తెలంగణ వరప్రధాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుంచి స్వల్ప ఇన్‌ఫ్లో కొనసాగుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ మహేందర్ తెలిపారు. ప్రాజెక్టులోకి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 19,036 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 7 గంటలకు 6,060 క్యూసెక్కులకు తగ్గిపోయిందన్నారు. ప్రాజెక్ట్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091అడుగులు (90.313 టీఎంసీలు)కాగా, ఆదివారం సాయంత్రానికి 1089.50 అడుగుల (82.215 టీఎంసీలు) మేర నీటి నిల్వ ఉన్నదన్నారు. గతేడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం 1,079.00 అడుగులు (49.698 టీఎంసీల) నీటి నిల్వ ఉన్నదని తెలిపారు.

904
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles