దీపావళి వేళ.. జర జాగ్రత్త..

Tue,October 17, 2017 09:35 AM

హైదరాబాద్ : దీపావళి పండుగ అనగానే పిల్లలకు ఎక్కడ లేని ఉత్తేజం వస్తుంది. కొత్త దుస్తులు ధరించి.. పిండి వంటకాలు ఆరగిస్తూ.. టపాసులు కాల్చుతూ ఆనందంతో గడుపుతుంటారు. ఈ ఆనందం విషాదాన్ని మిగల్చకూడదంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే! పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా పరిమితంగా టపాసులు కాల్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. శబ్ద, వాయు కాలుష్యం ఎక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


టపాసుల పొగ వల్ల శ్వాస వ్యవస్థకు ఇబ్బందులు
ఆరోగ్య రీత్యా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. టపాసులను కాల్చినప్పుడు వచ్చే పొగ వల్ల శ్వాస వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. టపాసులను ప్రధానంగా అల్యూమినియ్ పౌడర్, సల్ఫర్, బేరియం నైట్రేట్ లతో తయారు చేస్తారు. ఈ రసాయన పదార్థాలతో తయారైన బాణాసంచాను కాల్చినప్పుడు సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మాంగనీస్, కాడ్మియం వంటి రసాయనాలు విడుదలవుతాయి. ఈ రసాయన పదార్థాల వల్ల శ్వాస వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. అస్తమాతో బాధపడే వారు టపాసులకు దూరంగా ఉండటం మంచిది. అధికంగా టపాసులను కాల్చకూడదు. ఒకవేళ కాల్చినచో పొగ దట్టంగా కమ్ముకోవడంతో శ్వాస సమస్యలు తలెత్తి ఊపిరితిత్తులు పాడయ్యే అవకాశం ఉంది.

జాగ్రత్తలు
-ప్రతి ఒక్కరూ కాటన్ దుస్తులే ధరించాలి.
-కాటన్ దుస్తులు ధరించడం వల్ల ఒక వేళ నిప్పురవ్వలు పడితే మంటలు త్వరగా వ్యాపించకుండా ఉండేందుకు ఉపయోగపడుతాయి.
-టపాసులకు దూరంగా పసి పిల్లలను ఉంచాలి.
-టపాసులు కాల్చేటప్పుడు పిల్లల వద్ద పెద్దలు కచ్చితంగా ఉండాలి.
-ఇంట్లో, వీధుల్లో టపాసులు కాల్చరాదు.
-ఖాళీ ప్రదేశాల్లోనే టపాసులు కాల్చాలి.
-ఇంట్లోని సిలిండర్లు, గ్యాస్ స్టౌల వద్ద టపాసులు ఉంచరాదు.
-భారీగా శబ్దం వినిపించే టపాసులు కాల్చేటప్పుడు పిల్లలు, పెద్దలు తమ చెవులలో దూది పెట్టుకోవాలి.
-దీని వల్ల కర్ణభేరికి ఎలాంటి హాని జరగదు.
-అగ్నిప్రమాదం జరిగితే ఫైర్ సిబ్బందికి తక్షణమే సమాచారం అందించాలి.

4559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles