ఆస్తి కోసం తండ్రిని హతమార్చిన తనయుడు

Mon,April 22, 2019 10:30 PM

son killed his father for property

తిమ్మాజిపేట : ఆస్తి కోసం కన్న తండ్రిని హతమార్చిన సంఘటన నాగర్‌ర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం చంద్రాయన్‌పల్లితండా గ్రామపంచాయతీ మసీదుకుంటతండాలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. మూడవత్ గోప్యా(75)కు జడ్చర్లలో ఉన్న ప్లాటు విషయంలో మూడవత్ రవి తండ్రితో ఆ ప్లాటు తనకే ఇవ్వాలని పట్టుబట్టారని, అయితే తండ్రి చనిపోయిన తన ఇద్దరి కుమారుల వారసులతో పాటు నీకు ఇస్తానని స్పష్టం చేయడంతో ఆగ్రహించిన రవి తలపై బాదడంతో గోప్యా మృతి చెందినట్లు సీఐ తెలిపారు. కాగా ఆస్తి విషయంలో గత కొంత కాలంగా ఇంట్లో ఘర్షణలు జరుగుతుండేవని, అతని ముగ్గురి కుమారుల్లో ఇద్దరు చనిపోవడంతో నిందితుడు ప్లాటు తనకే చెందాలని ఘర్షణ పడేవారన్నారు. మృతుడి మనువడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

2880
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles