అసెంబ్లీ కమిటీలను ప్రకటించిన స్పీకర్

Sun,September 22, 2019 02:59 PM

హైదరాబాద్: శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ కమిటీలను స్పీకర్ ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ, అంచనాల కమిటీ చైర్మన్‌గా సోలిపేట లింగారెడ్డి, పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ చైర్మన్‌గా ఆశన్నగారి జీవన్‌రెడ్డి. అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు నడిచాయి. 58 గంటల 6 నిమిషాలు శాసనసభ సమావేశాలు కొనసాగాయి. ఈ సమావేశంలో మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యులుగా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ప్రకాశ్‌గౌడ్, అబ్రహం, శంకర్‌నాయక్, దాసరి మనోహర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, అహ్మద్ పాషా ఖాద్రీ, కోరుకంటి చందర్‌లను నియమించారు.

1895
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles