‘జీఎస్టీ పేరుతో అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు’

Wed,October 25, 2017 07:13 PM

హైదరాబాద్: వస్తువు ధరపై ఎమ్మార్పీ కంటే అదనంగా జీఎస్టీ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. తూనికలు, కొలతల విభాగంపై సీవీ ఆనంద్ నేడు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మకందారులు చట్ట విరుద్ధంగా వినియోగదారులపై పన్నులు వేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. జరిమానాగా రూ. 2 వేల నుంచి రూ. 25 వరకు విధిస్తామని తెలిపారు. ఎమ్మార్పీకి అదనంగా జీఎస్టీ వసూలుపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేక బృందాలు రేపట్నుంచి రాష్ట్రంలో తనిఖీలు చేస్తాయన్నారు. కాగా వినియోగదారుల సౌకర్యార్థం ఫిర్యాదు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న పౌరసరఫరాల వాట్సప్ నెంబర్ 733 0774 444 తోపాటు తూనికలు కొలతలశాఖ 738 6136 907, 27612170 నెంబర్లకు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.

2003
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles