ఢిల్లీ: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణం-2019 అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. పారిశుద్ధ్య నిర్వహణలో తెలంగాణ రాష్ర్టానికి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు వరించింది. కేంద్ర మంత్రి సదానందగౌడ చేతుల మీదుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిరంతర కృషి వల్ల పారిశుద్ధ్యం మెరుగైంది. 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక వల్లే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు దక్కింది. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచాం.
గతంలో ఎన్నడూ లేనివిధంగా పంచాయతీలకు నిధులు ఇస్తున్నాం. వ్యర్థాల తరలింపు కోసం ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్ ఇవ్వాలని నిర్ణయించాం. తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి తెలుసుకున్న కేంద్ర మంత్రులు కొంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు.