ముగిసిన రాష్ట్ర స్థాయి ఈత పోటీలు

Sun,May 26, 2019 11:09 PM

swimming competition in warangal completed

-ఓవరాల్ చాంపియన్ హైదరాబాద్
వరంగల్ జిల్లా స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో రెండురోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్స్, సబ్ జూనియర్స్ విభాగాల బాలబాలికల ఈత పోటీలు ఆదివారం ముగిశాయి. హన్మకొండ బాలసముద్రంలోని స్విమ్మింగ్‌ఫూల్ వేదికగా ఈపోటీలు జరిగాయి. ఆయా జిల్లాల్లో ఎంపికల్లో ప్రతిభ చూపిన 400 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తమ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినట్లు పోటీల నిర్వాహణ కార్యదర్శి స్వామిచరణ్ తెలిపారు.

ఇవాళ సాయంత్రం స్విమ్మింగ్ పోటీలు ముగియగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్విమ్మింగ్ సంఘం కార్యదర్శి రామకృష్ణ హాజరై విజేతలకు పతకాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో అద్భుతమైన ప్రతిభ చూపిన క్రీడాకారులు త్వరలో జాతీయస్థాయిలో జరగబోయే పోటీల్లో రాష్ట్రజట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు.

ఓవరాల్ చాంపియన్ హైదరాబాద్


రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో హైదరాబాద్ జట్టు(250 మెడల్స్) ఓవరాల్ చాంఫియన్‌గా నిలిచింది. రంగారెడ్డి జిల్లా (150 మెడల్స్) సాధించి రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకుంది. జూనియర్స్, సబ్ జూనియర్స్ బాల బాలికల విభాగంలో జరిగిన పోటీల్లో 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారని పోటీల నిర్వహణ కార్యదర్శి స్వామిచరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్విమ్మింగ్ సంఘం అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, జిల్లా స్విమ్మింగ్ కోచ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

422
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles